YS Sharmila Allegations in Phone Tapping Case | తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితురాలిగా వైఎస్ షర్మిల | ABP Desam

 తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఓ వైపు తెలంగాణలో ఈ కేసుపై లోతుగా విచారణ జరుగుతున్న టైమ్ లో ఏపీ నుంచి వైఎస్ షర్మిల వర్గం సంచలన ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ను ట్యాప్ చేసి అన్నీ విన్నారు అనేది షర్మిల వర్గం చేస్తున్న ఆరోపణ. దీనికి సంబంధించి వాళ్ల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. తన అన్న వైఎస్ జగన్ తో విబేధించి తెలంగాణకు వచ్చి సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టుకున్న షర్మిల కదలికలను అప్పట్లో చాలా క్లోజ్ గా మానిటర్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. షర్మిల ఎవరితో మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు ఇలా అన్నీ గమనించేవారని ఆ సమాచారమంతా ఏపీ ప్రభుత్వ పెద్దలకు ట్రాన్స్ ఫర్ చేసేవారని సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అప్పటి ప్రభుత్వ అధినేతలే తెలంగాణలో చేయించారా లేదా తెలంగాణ ప్రభుత్వం చేయించి ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించిందా అన్న విషయం మాత్రం షర్మిల వర్గం క్లారిటీ ఇవ్వట్లేదు. దీనిపై రేపో ఎల్లుండో  షర్మిలనే గొంతు విప్పనున్నారని ఏబీపీ దేశానికి అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola