YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP Desam

వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకూ జాతీయ రాజకీయాల్లో  భారతీయ జనతా పార్టీకి హార్డ్ కోర్ సపోర్టర్ గా ఉన్నారు. అందరికి తెలిసిందే..!కానీ 24 గంటల్లో సీన్ మారిపోయింది. దిల్లీలో జగన్ ధర్నా చేస్తే ఇండియా కూటమి సంపూర్ణ మద్దతునిచ్చింది. దీంతో.. ఇప్పుడు జగన్ ఇండియా కూటమిలో చేరినట్లేనా..? అంటే మోదీకి ఎదురు తిరుగుతన్నట్లేనా..? కేసుల భయాన్ని పక్కన పెట్టి జగన్ వేస్తున్న వ్యూహమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఇంత కాలం బీజేపీకి దగ్గరగా ఉండటానికి కారణం ఆయనపై ఉన్న కేసులేనని అంతా ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం అంటూ మోదీకి ఎదురు తిరిగితే బెయిల్ రద్దవుతుంది మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని జగన్ భయపడ్డారేమో అందుకు మోదీకి సపోర్ట్ చేశారునుకుందాం. ఐతే.. ఇప్పుడు కూడా మోదీదే కదా అధికారం..? అందులోనూ జగన్ కు అధికారం పోయింది. ఈ  సమయంలో మోదీ అనుకుంటే జైలులో వేయడం ఎంత సేపు చెప్పండి..!  ఐనా సరే.. జగన్ ఎందుకు ఇండియా కూటమిలోకి వెళ్లాలని అనుకుంటున్నారంటే. లిక్కర్ స్కాం, ఇసుక స్కాం, ఇలాగే వైఎస్ వివేకా హత్య కేసుల్లో జగన్ ను జైలులోకి పంపడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతే కదా..40 ఏళ్ల రాజకీయ జీవితంలో  ఎవరు బాబును జైలుకు పంపించలేదు. మరి జైలుకు పంపించిన జగన్ ను చంద్రబాబు ఊరుకుంటారా..! అంటే నో అనే చెప్పాలి. ఏపీలో రాజకీయ ప్రత్యర్థులు లేరు రాజకీయ శత్రువలే ఉంటారు అలా తయారైంది పరిస్థితి. ఈ సమయంలో జగన్ గురించి  మోదీ చెప్పిన బాబు వినే పోజిషన్ లో లేరు. ఇన్ ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు బాబు ఎంత చెబితే మోదీకి అంతా..! సో.. ఈ సమయంలో మోదీతో స్నేహం చేసినా ఏం ఫాయిదా లభించదని జగన్ భావిస్తున్నట్లు ఉన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola