YS Jagan Suspects EVMs for his defeat in Elections 2024 seeking National wide debate | ఓటమిపై విశ్లేషించి మాట్లాడిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఓటమిపై విశ్లేషిస్తూ మాజీ సీఎం జగన్ తొలిసారిగా మాట్లాడారు. ఆయన క్యాంప్ ఆఫీసులో వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన.. ఓటమి తరువాత నాయకులు ఎలా ముందుకు సాగాలి అన్నదానిపై ఆయన దిశా నిర్దేశం చేశారు..!
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో సమవేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సి ఉందన్నారు. అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా రానందున మన వాయిస్ వినిపించకుండా అధికారపక్షం కుట్ర చేసే అవకాశం ఉందని .. అందుకే మనకు బలం ఉన్న శాసనమండలిలో గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు సూచించారు.
ప్రభత్వ పరంగా బటన్ నొక్కిన పథకాలకు ఇంకా నిధులు ఇవ్వలేదని జగన్ ఎమ్మెల్సీలకు చెప్పారు. చంద్రబాబు చేసే తప్పులు శిశుపాలుడి తప్పుల్లా లెక్కిద్దామన్నారు. కొంత సమయం ఇచ్చి పోరాడదామని సూచించరు. సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ నలభై శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అవసరం అయితే రాను త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తానన్నారు. మనం చేసిన మంచి ప్రజలకు గుర్తు ఉందన్నారు.