YS Jagan Palnadu Tour Two Persons Death | వైఎస్ జగన్ పల్నాడు ర్యాలీలో విషాదం | ABP Desam

Continues below advertisement

 మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో విషాదం నెలకొంది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. జగన్ రెంటపాళ్ల ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా...సత్తెనపల్లి లో మరో వ్యక్తి ర్యాలీలో స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా ఏటుకూరులోని లాల్ పేట హైవే పే జగన్ ర్యాలీ కాన్వాయ్ వెళ్తుండగా ఓ వాహనం ఢీకొని 53ఏళ్ల సింగయ్య అనే వ్యక్తి కన్నుమూశాడు. రోడ్డు పక్కనే విలవిలాడుతున్న సింగయ్య ఆసుపత్రికి తరలించినా కన్నుమూసినట్లు...జగన్ కాన్వాయ్ లోని వాహనమే సింగయ్యను ఢీకొట్టినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ మీడియాకు తెలిపారు. జగన్ ర్యాలీ సందర్భంగా సత్తెనపల్లి గడియార స్తంభం దగ్గర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సత్తెనపల్లి ఆటోనగర్ కి చెందిన 30ఏళ్ల పాపసాని జయవర్థన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులకు వైద్యులు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola