YS Jagan Fan Breach Security | జగన్ ను కలవాలని ముళ్ల కంచె దూకేసి | ABP Desam
అమర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కిల్లితండాకు వెళ్లారు వైఎస్ జగన్. అయితే ఇదే సమయంలో జగన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. సరిగ్గా నెల క్రితం పరామర్శ కోసం జగన్ రాప్తాడు వస్తే అప్పుడు ఆయన హెలికాఫ్టర్ మీదకు వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. భద్రతా వైఫల్యం అంటూ పోలీసులపై వైసీపీ నేతలు మండిపడటం..పోలీసులు ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈరోజు మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించటం కోసం జగన్ వస్తున్నారనే సమాచారంతో ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతం మొత్తం కంచెలు వేశారు పోలీసులు. వైసీపీ కార్యకర్తలైనా అభిమానులైనా కంచెల వెనుకే ఉండి జగన్ ను చూసేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఓ అభిమాని మాత్రం సెక్యూరిటీని బ్రీచ్ చేశాడు. ఉన్నపళంగా కంచెను దూకేసి జగన్ ను కలిసేందుకు వెళ్లబోయాడు. అయితే పోలీసులు ఆ అభిమానిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం జగన్ పై అభిమానంతో మాత్రమే ఆ కుర్రాడు అలా చేశాడని అందుకే కేసు పెట్టలేదని చెప్పారు పోలీసులు.