YS Jagan Comeback AP Politics | చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఇకపై చుక్కలేనా | ABP Desam
వైఎస్ జగన్ ఇప్పుడు ఎక్కడున్నారు. చాలా మందికి ఈవెన్ హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ కి కూడా ఆయన నిన్నటి వరకూ లండన్ లోనే ఉన్నారని తెలియదు. రీజన్ జగన్ చాలా అంటే చాలా సైలెంట్ అయిపోవటమే. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరీడ్ ఇద్దామనుకున్నారో...లేదో వై నాట్ 175 అన్న ఆయనకు ప్రజలు ఇచ్చిన 11 సీట్ల షాక్ నుంచి ఇంకా కోలుకోలేదో తెలియదు కానీ ఏదో అడపా దడపా కాస్తో ఇష్కిస్తో ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆయన ఈ ఆరెడు నెలల కూటమి పాలనపై పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు. ఇదేం జగన్ అసమర్థతనో, ఆయన వైఫల్యాలనో ఎత్తి పొడవటానికి చేస్తున్న వీడియో కాదు. ప్రజాసామ్యానికి ఓ ప్రతిపక్షం కావాల్సిన అవసరం చెబుదామని చేస్తున్న వీడియో.ఎన్నో ఒడిదుడుకులు వైసీపీకి ఈ ఆరేడు నెలల కాలంలో. పార్టీకి అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా దూరం అయిపోతున్నారు. కొందరు పదవీ కాంక్షతో టీడీపీ, జనసేనల్లో చేరితే..మరికొందరు కూటమి ప్రభుత్వం ను శరణు కోరుతూ ఆ పార్టీలో చేరిపోయి సైలెంట్ అయిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నోరేసుకుని పడిపోయిన కొడాలి నాని శీతాకాల సుప్తావస్థలో ఉన్నారు. ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు. పేర్ని నాని పీడీఎస్ బియ్యం స్కామ్ లో లాక్ అయిపోయారు. గుడి వాడ అమర్ నాథ్, రోజా మాట్లాడితే భారీ ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న పరిస్థితి. అన్నింటికంటే పెద్ద షాక్ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీనే కాదు రాజకీయాలనే వదిలేయటం. ఇక పార్టీలో ఉన్న ఒక్క సీనియర్ బొత్స సత్యనారాయణ మాత్రం తన అనుభవాన్ని ఉపయోగిస్తూ మండలిలో వైసీపీ బండిని లాక్కొస్తున్నారు. ప్రతిపక్షం ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిథ్యం నిల్లు.