YS Jagan 3 Mistakes in one Week | తెలిసి చేశారో..తెలియక చేశారో..ఈ మూడూ తప్పులే | ABP Desam
రాజకీయాల్లో ప్రతీ అడుగు ఎంతో లెక్క చూసుకుని వేయాలి అంటారు. వ్యూహ ప్రతివ్యూహాలతో నిండి ఉండే పాలిటిక్స్ లో ఒక్క పొరపాటు మొత్తం రాజకీయ పార్టీ దిశను మార్చేస్తుంది. అలాంటిది జూన్ నెల వచ్చిన మొదటి వారం రోజుల్లోనే ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసిపి వరుసగా మూడు పొరపాట్లు చేసిందంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్ లు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వారం రోజుల వ్యవధిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఊహించని రీతిలో మూడు నిర్ణయాలు వచ్చాయి. ఈ మూడు నిర్ణయాలు పార్టీ క్యాడర్ కే కాదు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతు చిక్కటం లేదు. స్ట్రాటజీ గా భావించి జగన్ కావాలనే తీసుకున్న నిర్ణయాలే..లేదా ఎవరైనా మిస్ లీడ్ చేస్తున్నారో..మరేదైనా కారణం ఉందేమో తెలియదు కానీ ఈ మూడు నిర్ణయాలు వారం రోజుల్లోనే రావటం వైసీపీ క్యాడర్ ను సైతం ఆశ్చర్యపరుస్తోంది.ఇందులోని రాజకీయ కోణం అందరికీ తెలిసిందే కానీ ఆ వ్యాఖ్యలు ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసిపి థింక్ ట్యాంక్ కచ్చితంగా పొరపాటు చేసింది అనేది ఎనలిస్టుల అభిప్రాయం. దీన్ని మరి వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.