YS Avinash Reddy Arrest | ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ లో పులివెందులతో పాటు ఒంటిమిట్టలో మంగళవారం జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉదయం  7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రెండు మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా, ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడే నిరసనకు దిగారు. అనంతరం కార్యకర్తలను పంపించిన పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసారు. 

 

ఆంధ్రప్రదేశ్ లోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని ముందస్తుగా అరెస్ట్ చేసారు పోలీసులు. అలాగే వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసారు. రెండు మండలాల్లో 1500 మంది పోలీసులు ... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola