YCP TDP Attack In Kondapalli: పురపాలక సంస్థ కార్యాలయం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పురపాలక సంస్థ కార్యాలయం వద్ద వైసీపీ,టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. కార్యాలయం వద్ద నిర్వహించనున్న వైద్య శిబిరానికి సంబంధించిన సమాచారం తమకు చెప్పలేదని టీడీపీ కౌన్సిలర్లు కమిషనర్ ను ప్రశ్నించారు. దీంతొ పెద్ద గొడవ చోటుచేసుకుంది. అదే సమయంలో వైసీపీ కౌన్సిలర్లు కూడా చేరుకోవటంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.