YCP MLA MS Babu Comments On CM Jagan: దళితుడిగా పుట్టడమే వేస్టా.. డబ్బులిస్తే ఐప్యాక్ సర్వే ఫలితాలు మారతాయి.. వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల కోసం టికెట్ల కేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఎంతో పనిచేశానని, గడపగడపకు తిరిగానని, అయినా ఇప్పుడు టికెట్ ఇవ్వట్లేదని చెప్పడమేంటని ప్రశ్నించారు. దళితుడిగా తాము ఏం కర్మ చేసుకున్నామంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.