MP Madhav : పెనుకొండ లో వైసీపీ , టీడీపీ మధ్య మాటల యుద్ధం
అనంతపురం జిల్లా ,పెనుకొండ మునిసిపల్ ఎన్నికలలో ఉదయం నుండి పోలింగ్ ప్రారంభమైంది. పెనుకొండ లో 17వ వార్డులోకి వెళ్తున్న పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ ను, టిడిపి హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి అడ్డుకున్నారు. మీరెట్లా ఆయన్ని లోపలికి పంపిస్తారని పోలీసులను ప్రశ్నించారు . ఇద్దరి మద్య వాగ్వాదం జరగడం తో పోలీసులు అడ్డుకొని ఇద్దరికి నచ్చజెప్పారు.