“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!

యానాంలో ఓ యువకుడు నానా హంగాాామా సృష్టించాడు. తన ఫోన్‌ను పోలీసులు అనవసరంగా లాక్కున్నారంటూ.. సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.  యానాం సిద్ధార్థ నగర్‌కు చెందిన అలీషా అనే యువకుడు సోమవారం నాడు సెల్ టవర్ పైకి ఎక్కి సుమారు రెండు గంటల పాటు హైడ్రామా సృష్టించాడు. తన వాట్సాప్ స్టేటస్ వివాదాస్పదంగా ఉందనే కారణంతో పోలీసులు తన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని, నాలుగు రోజులు గడిచినా తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ అతను ఈ నిరసనకు దిగాడు. టవర్ పైనుంచి దూకేస్తానని, మెడకు వైరు కట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని అలీషా బెదిరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మెగా ఫోన్ల ద్వారా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా పైకి వచ్చే ప్రయత్నం చేస్తే దూకేస్తానని అతను హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు అతనికి భరోసా ఇవ్వడంతో సురక్షితంగా కిందకు దిగి వచ్చాడు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola