Yanam Streets Flooded: వృద్ధ గౌతమి నది ఉద్ధృతితో ఒక్కసారిగా జలమయమైన యానాం వీధులు| ABP Desam
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంను వరదనీరు ఒక్కసారిగా ముంచెత్తింది. వృద్ధ గౌతమి నది ఒక్కసారిగా ఉద్ధృత రూపం దాల్చటంతో... పరీవాహక ప్రాంతంలో ఉన్న యానాం పూర్తిగా జలదిగ్బంధమైంది. యానాంలో ఏ వీధి చూసినా వరదనీరు ముంచెత్తింది. ఒక్కసారిగా వరద ముంచుకురావటంతో ప్రజలంతో ఉన్నపళంగా బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలా వరద రావటం ముమ్మాటికీ అధికారుల వైఫల్యమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందుగా వరద పరిస్థితిని అంచనా వేయలేకపోయారని, ఇసుక బస్తాలతో వరదను కట్టడి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.