Workers Dump Garbage In Tadipatri Muncipal Office: ఆఫీస్ లో చెత్త పారబోసి కార్మికుల నిరసన
కనీస వేతనాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి డిమాండ్ల పరిష్కారానికి కొన్నిరోజులుగా నిరసన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇవాళ తాడిపత్రిలోని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ ఛాంబర్ ఎదుట చెత్త, కోళ్ల వ్యర్థాలు పారబోసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మున్సిపల్ అధికారులు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.