Women's Reservation Bill Passed : మహిళల అధికారానికి పట్టం కట్టిన రాజ్యసభ | ABP Desam
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో ఊహించని మద్దతు లభించింది. ముందు నుంచి రాజ్యసభలో బిల్లుకు మద్దతు లభిస్తుందా లేదా అన్న డైలమాలో ఉన్న కేంద్రసర్కారుకు ఊహించని రీతిలో పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతు పలికారు. పార్లమెంటు చరిత్రలో అత్యంత అరుదైన ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయేలా మహిళా రిజర్వేషన్లు బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.