Vizag Airport: వరద నీటిలో విశాఖ ఎయిర్‌పోర్ట్.. తీరం దాటినా తప్పని తుపాను ముప్పు!
గులాబ్ తుపాను తీరం దాటినా విశాఖపట్నానికి ముప్పు తప్పడం లేదు. నేటి సాయంత్రం నుంచి మరోసారి భారీ వర్షం కురవడంతో విశాఖపట్నం ఎయిర్ పోర్టు నీట మునిగింది. విమానాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఉతరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లు జలాశయాలను తలపిస్తున్నాయి.