Zoo Park: కరోనా ఎఫెక్ట్ తో తిరుపతి జూపార్క్ కు నిధుల కొరత
Continues below advertisement
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు.. ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు స్వేచ్చగా తిరిగే జంతువులు సందర్శకులను ఎంతగానో కనువిందు చేస్తూనే ఉంటాయి అనడంతో సందేహం లేదు.. తిరుపతి నగర వాసులతో పాటు శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చిన వారు ఎస్వీ జూపార్క్ ను సందర్శించడం వారికి ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది.. నిత్యం వేల మంది సందర్శకులతో కిటకిట లాడుతూ సందడిగా ఉంటుంది జూపార్క్.. ఇది అంతా కరోనా రాక ముందు వరకూ అయితే కరోనా ప్రభావంతో నేడు వెలవెల బోతుంది.. కరోనా కారణంగా యావత్తూ మానవాళే కాదు.. మూగజీవాలు కూడా అల్లడి పోతాయి అనేందుకు తిరుపతి జూపార్క్ ఒక నిదర్శనం.
Continues below advertisement