Tirumala: తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం
Continues below advertisement
ఇటీవల వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలను కేరళ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కేరళ కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద అంతర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్న నిపుణుల బృందం కొండ చరియలను పరిశీలించింది. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టీటీడీ ఆహ్వానించింది. ల్యాండ్ స్లైడ్స్ నిపుణులు కొండచరియలు విరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక శాస్త్రా పరిజ్ఞానం ఉపయోగించుకొని సమగ్ర సర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు.
Continues below advertisement