Tiruchanuru Bramhotsvam: గరుడ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు శ్రీవారి పాదాలు ధరించి గరుడ వాహనంపై అభయమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదాలను పంపుతున్నారని ఐతిహ్యం.