Nellore TDP: వరద బాధితులకు సాయం అందలేదు : టీడీపీ

నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన తూతూ మంత్రంగా జరిగిందని విమర్శించారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్. ప్రతిపక్షంలో ఉండగా.. లెక్కలెందుకు అందరికీ నష్టపరిహారం ఇవ్వొచ్చుకదా అని బీరాలు పలికిన జగన్.. ఇప్పుడు అందరికీ పరిహారం ఎందుకివ్వలేదని నిలదీశారు. నెల్లూరు రూరల్ మండలంలోని ములుముడి గ్రామంలో పర్యటించి వరదబాధితులతో మాట్లాడారాయన. వైసీపీ కార్యకర్తలకే సాయం అందిందని, సామాన్యులను అసలు పట్టించుకోలేదన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో 90శాతం బాధితులకు సాయం అందిందని సీఎం చెప్పిన విషయాన్ని అజీజ్ గుర్తు చేశారు. ఒకరికి ఇచ్చి, మరొకరికి ఇవ్వలేదని, కనీసం ములుముడి లాంటి గ్రామాల్లో ఏ అధికారి, నాయకుడు పర్యటించలేదని విమర్శించారు. బాధితులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ని కలిసి అందరికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola