Chandragiri Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పి కారులో మృతదేహాలను బయటకు తీశారు. కారు నెంబరు AP39HA 4003గా గుర్తించారు. మృతులను విజయనగరం జిల్లాకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola