Cm Jagan: చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
చిత్తూరు జిల్లాకు వరదల వల్ల ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండలం పాపా నాయుడుపేట నుంచి గుడిమల్లం మీదుగా వెళ్లే స్వర్ణముఖి నది మీద నిర్మించిన బ్రిడ్జి ఇటీవల వరదలకు కొట్టుకుపోగా ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ, ఏపీ ట్రాన్స్కో, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాలకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ వివిధ అధికారులతో కలసి వివరించారు. అనంతరం గుడిమల్లం కు వెళ్లే బ్రిడ్జి స్వర్ణముఖి నది దాటి కి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా నదీ ప్రవాహం వల్ల పదహైదు గ్రామాలకు రాకపోకలు లేవని అదే విధంగా పలు భూములు కూడా ప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయని భూములను కూడా ముఖ్యమంత్రికి చూపించారు. మొత్తం 195 మీటర్లు గల బ్రిడ్జి కొట్టుకు పోయిందని, తాత్కాలిక మరమ్మతులకు కోటి రూపాయలు ఖర్చు అవుతుందని, శాశ్వతంగా నిర్మూలించేందుకు 20 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.