Kidnap Case: అమ్మ చెంతకు చిన్నారి.. అపహరణకు గురైన పాప దొరికింది
సెప్టెంబర్ 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ వద్ద అపహరణకు గురైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని అపహరించిన యువతితో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు దంపతులను అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశాకు చెందిన చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.