Municipal Elections: జనసేన నుంచి బరిలోకి దిగనున్న ‘గల్లీ బాయ్స్’ రియాజ్
Continues below advertisement
ప్రముఖ టీవీ ఆర్టిస్ట్, గల్లీబాయ్స్ రియాజ్ జనసేన తరఫున కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. 30వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైంది. గల్లీబాయ్స్ రియాజ్ కోసం ఆయన స్నేహితులు, ఇతర టీవీ ఆర్టిస్టులు కూడా వస్తారని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే జనసేన పార్టీలో సందడి నెలకొంది. రియాజ్ తో పాటు మరికొందరు ప్రచారం ముమ్మరం చేశారు. నోటిఫికేషన్ విడుదలై, అధికారికంగా ప్రచార కార్యక్రమాలు మొదలైతే మాత్రం నెల్లూరులో టీవీ ఆర్టిస్ట్ ల సందడి పెరిగే అవకాశముంది. అటు జబర్దస్త్ నటీనటులతో వైసీపీ, టీడీపీ నేతలకు పరిచయాలున్నాయి. జనసేనకు పోటీగా వారు కూడా టీవీ ఆర్టిస్ట్ లను ప్రచార కార్యక్రమాలకు తీసుకొస్తారని తెలుస్తోంది.
Continues below advertisement