Cyclone Gulab: గులాబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో అలర్ట్
శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలుంటాయి. టెక్కలి, పలాస, సోంపేట ప్రాంతాల్లో గులాబ్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా ఈ రోజు సాయంకాలం, రాత్రి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే విధంగా ఒడిషా ఎగువన కురిసే తీవ్రమైన వర్షాల కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.