Police Open House: చిత్తూరు జిల్లాలో పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం
పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఏటా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా ఏఆర్ పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరేడ్ మైదానంలో జిల్లా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రదర్శనగా ఉంచారు. ఓపెన్ హౌస్ కు విచ్చేసిన విద్యార్ధులకు ఆయుధాల గురించి ఎఆర్ సిబ్బంది అవగాహన చేశారు. ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధాన్ని వినియోగిస్తారు, వాటి పని తీరు గురించి అవగాహన కల్పించారు.