VV Meraka MPP School : అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలో దారుణం | DNN | ABP Desam
అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీ మెరక ఎంపీపీ స్కూల్లో ఓ ఉపాధ్యాయుడి ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఎంపీపీ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడిని అల్లరి చేస్తున్నాడని టీచర్ పనిష్మెంట్ విధించాడు.అదేంటంటే ఆ పిల్లాడిని డస్ట్ బిన్ లో కూర్చోపెట్టి పది నిమిషాల పాటు మూత పెట్టాడు.ఇంటికి వెళ్లి తల్లితండ్రులతో స్కూల్లో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిన విద్యార్థి చెప్పటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్కూలు ముందు విద్యార్థి తల్లితండ్రులు ఆందోళన చేపట్టారు.