Vundavalli Sridevi Met Chandrababu : శ్రీకాకుళం జిల్లా పర్యటనలో చంద్రబాబుతో ఉండవల్లి శ్రీదేవి భేటీ.!
వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిశారు.శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును గూనభద్ర లో కలిసిన శ్రీదేవి..రాజకీయంగా తనకు అండగా ఉండాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో టీడీపీ లో చేరే విషయంపై క్లారిటీ ఇస్తానన్నారు. సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.