Vizag old Light house Tower | ఎన్నో సినిమాల్లో లొకేషన్..వైజాగ్ పాత లైట్ హౌస్ ఇక కనిపించదు | ABP

 విశాఖపట్నం లైట్ హౌస్ ని కూల్చివేస్తారు అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఇది నిజమే అనిపిస్తుంది ప్రస్తుతానికి అక్కడున్న విశాఖ ప్రజలకు.1950. సంవత్సరంలో నిర్మాణం చేపట్టిన ఈ లైట్ హౌస్ ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది ప్రస్తుతానికి ఈ లైట్ హౌస్ అయితే మాత్రం పనిచేయటం లేదు ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్లకు ప్రాధాన్యతగా ఉండేది. ఇప్పుడు ఈ లైట్ ఓ చుట్టూ గ్రిల్ వేసి అటువైపు ఎవరిని కూడా వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది అయితే ఇది ఏ క్షణానైనా కూలిపోయే అవకాశం ఉండడంతో కూల్చివేస్తారు అంటూ ప్రచారం కొనసాగుతుంది విశాఖపట్నం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. శిథిలావస్థకు చేరుకున్న విశాఖపట్నం పాత లైట్ హౌస్ ను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 1950లో నిర్మించిన ఈ లైట్ హౌస్ 75ఏళ్లుగా పర్యాటకులను, స్థానికులను ఆకర్షించటంతో పాటు సముద్రంలో మత్స్యకారులకు దిక్సూచిలా సేవలందించింది. ఎన్నో సినిమాల్లో లొకేషన్ పాయింట్ గా కనిపించిన లైట్ హౌస్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుని చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధమౌతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola