Vizag MILAN 2026 Parade | సాగరతీరంలో గ్రాండ్ గా మిలన్ 2026 వేడుకలు | ABP Desam

ఇంటర్నేషనల్ వార్ షిప్ ఫెస్టివల్ సందర్భంగా విశాఖ సాగరతీరంలో నిర్వహించిన మిలన్ 2026 గ్రాండ్ గా జరిగింది.  ఇండియన్ నేవీ కి చెందిన హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలు, యుద్ధ విన్యాసాలతో పాటు డేంజరస్ సిచ్యుయేషన్స్ లో చేసే రెస్క్యూ ఆపరేషన్స్ ను ఇండియన్ నేవీ మెరైన్ కమెండోలు చేసి చూపించారు. ఒళ్లు గగుర్పొడిచే ఆ సైనిక కార్యకలాపాలను తిలకించేందుకు విశాఖ తీరం సందర్శకులతో పోటెత్తింది. మొత్తం 60 ఇండియన్ నేవీ హెలికాఫ్టర్లు, విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తూ ఆకట్టుకున్నాయి. భారత నేవీతో పాటు వివిధ దేశాల నౌకదళం నిర్వహించిన సిటీ పరేడ్ అబ్బురపరిచింది. భారత్ త్రివిధ దళాలతో పాటు, రష్యా, బంగ్లాదేశ్ నేవీ సోల్జర్స్, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ కు చెందిన గ్రే హౌండ్స్, ఆక్టోపస్ దళాలు  కవాతును నిర్వహించాయి. సాగర తీరం విశాఖ పట్నం వెంబటి భారత సైనిక దళాలు, రక్షణ దళాలు చేస్తున్న సైనిక విన్యాసాలు కవాతును చూసేందుకు వచ్చిన వేలాది మంది నగరంలో సందడి వాతావరణం నెలకొంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola