Vizag Human Trafficking Racket Busted | హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకున్న వైజాగ్ పోలీసులు | ABP Desam

డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ రవి శంకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 150 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని తెలిపారు. అనేక దేశాలకు చెందిన ⁠దాదాపు ఐదు వేల మంది యువకులు వీరి చేతిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఫెడ్ ఏక్స్ , టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాల చెయ్యడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ నుంచి కంబోడియా కి వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీని కోసం నిరుద్యోగుల దగ్గర నుంచి కూడా రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారన్నారు. ఆన్‌లైన్ స్కాములు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇచ్చి, ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయిస్తున్నారని తెలిపారు. అక్కడి వారికి అన్నం కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola