Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP

Continues below advertisement

గ్లోబల్ జెయింట్.. గూగుల్ వైజాగ్ వచ్చేసింది. మొత్తం ఇంటర్నెట్ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న గూగుల్‌ ప్రపంచంలోనే అతిపెద్ద AI హబ్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది. ఏకంగా లక్షా 30వేల కోట్ల పెట్టుబడి వస్తున్నట్లు ప్రకటించింది.  ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ఇండియాకు వచ్చిన అతిపెద్ద FDI ఇది. ఇంత భారీ పెట్టుబడి రావడం భారత్‌లో చాలా ప్రముఖమైన డవలప్‌మెంట్ ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్‌కు రావడం గర్వకారణం. ఇంత పెద్ద సంస్థ అంత పెద్ద పెట్టుబడిని పెడుతోంది కాబట్టే వారం రోజులుగా దీనిపైనే చర్చ జరుగుతోంది. జనరల్‌గా ఇంత పెద్ద పెట్టుబడి వచ్చినప్పుడు ప్రతీ ఒక్కరూ సంతోషపడతారు. ఏ రాష్ట్రానికి వస్తే.. అక్కడ వాళ్లలో ఆ ఆనందం ఇంకా ఎక్కువ ఉండాలి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో దీనిపై మిక్స్‌డ్ రియాక్షన్ ఉంది. గూగుల్ లాంటి సంస్థ ఏపీకి రావడంపై పర్సనల్‌గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక బిగ్ జెయింట్ వచ్చినప్పుడు.. ఎలాంటి ఎకోసిస్టమ్ వస్తుందన్న దానికి హైదరాబాద్‌లో మైక్రోసాప్ట్ ఉదాహరణగా ఉంది. ఇప్పుడు అదే సిమిలారిటీ వైజాగ్‌లో కనిపిస్తోంది. కానీ మరి అలాంటి డవలప్‌మెంట్ ఇక్కడ వస్తుందా..? ప్రభుత్వం చెప్పే ఉద్యోగాలు రావు అని, పర్యావరణపరంగా సమస్యలు అని.. ఈ ప్రభుత్వం గూగుల్‌ను రప్పించడం కోసం ఉదారంగా చాలా తాయిలాలు ఇచ్చేసిందని.. ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నప్పుడు.. ప్రభుత్వం వైపు నుంచి దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గూగుల్ రాకపై అధికార ప్రకటన వచ్చింది, ఆ తర్వాత సంబంధిత మంత్రి లోకేష్ మీడియా సమావేశంలో చాలా విషయాలు చెప్పారు. అయినా కానీ కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola