Vizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP Desam

Continues below advertisement

  విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ అందరికీ తెలుసు. కానీ వైజాగ్ సాగర్ నగర్ కారడవిలో ఓ క్రికెట్ గ్రౌండ్ ఉందని చాలా మందికి తెలియదు. అడవి ఏంటీ..అడవిలో క్రికెట్ గ్రౌండ్ ఏంటీ తెలుసుకోవాలనుందా..అయితే ఈ వీడియో స్టోరీ చూసేయండి.వైజాగ్ నడి మధ్యలో ఒక సీక్రెట్ గ్రౌండ్  చాలా పెద్దది ఉందని చాలామందికి తెలీదు. ఎందుకంటే అది అడవిలో ఉంటుంది కాబట్టి. ఆ ప్రదేశానికి వెళ్లినా ఆ గ్రౌండ్ ను కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే దానికి సరైన దారి కనిపించదు కాబట్టి. కానీ అది క్రికెట్ కోసం నిర్మించినది కాదు. కానీ అడవి మధ్యలో పెద్ద కొలనులా ఉండే ఆ గ్రౌండ్ అంటే క్రికెట్ ప్రేమికులకు చాలా ఇష్టం. అడవిని తలపించే ఆ మార్గంలో అక్కడికి వెళ్లాలని చాలామందికి ఉంటుంది. ఎందుకంటే అంతే కొత్తగా ఉంటుంది. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అంతగా ఇష్టపడతారు క్రికెట్ విశాఖపట్నంలో పెరుగుతున్న జనాభా ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేక కొంతమంది యువకులు ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు అక్కడికి వెళ్లడానికి భయపడతాం కానీ వెళ్లి మాత్రం ఈ ప్రాంతానికి ఎలా వెళ్తున్నారో కూడా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. విశాఖపట్నం జూ పార్క్ నుండి సాగర్ నగర్ వెళ్లే రహదారి మధ్యలో కొన్నేళ్ల కిందట ప్రభుత్వం డాల్ఫిన్ హిల్స్ చేయాలని ఒక ప్రతిపాదన ఉండేది దానికోసం ఒక నిర్మాణాన్ని కూడా చేపట్టింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్మాణం అక్కడితో ఆగిపోవడంతో అటువైపు యువకులకు మంచి క్రికెట్ గ్రౌండ్ గా దొరికింది ఇంకేముంది మన కుర్రవాళ్ళు అసలే ఆగుతారా కుమ్మేస్తారు లోపలికి వెళ్లి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram