Vishnuvardhan Reddy: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సత్య ప్రమాణం..

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య ఆరోపణలు, పరస్పర విమర్శలు సత్య ప్రమాణం వరకు వెళ్లాయి. నేడు వేదపండితులు, అధికారులు, బీజేపీ శ్రేణుల మధ్య విష్ణువర్ధన్ రెడ్డి సత్య ప్రమాణం చేశారు. తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, మఠాలు, ఆశ్రమాల నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేశారు. తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు వచ్చానన్నారు. రాచమల్లుకు దేవాలయాలపై నమ్మకం లేదని, నిజాయితీ నిరూపించుకోవడానికి రాకుండా పారిపోయాడని ఆరోపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola