Vizag Woman Attack On Police : మద్యం మత్తులో హల్ చల్ చేసిన యువతి | DNN
వైజాగ్ లో YMCA వద్ద అర్ధరాత్రి అమూల్య అనే యువతి హల్ చల్ చేసింది. బీర్ తాగుతూ గంజాయి సేవిస్తున్నావా అని అడిగినందుకు త్రీ టౌన్ ఏఎస్ఐ సత్యనారాయణపై బీర్ బాటిల్ విసిరి దాడి చేసింది. ఆయన తప్పించుకోగా... అక్కడే ఉన్న గోవింద్ అనే యువకుడి కంటికి బలమైన గాయమైంది. ఆ యువతి పోలీసులపై తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషణకు దిగింది. కంటికి గాయమైన గోవింద్.... అమూల్యపై ఫిర్యాదు చేశారు.