Visakha Shops Demolition : ఆంధ్ర యూనివర్సిటీ సమీపంలో షాపులు కూల్చేసిన అధికారులు | DNN | ABP Desam
Continues below advertisement
విశాఖపట్నం ఆంధ్రయూనివర్సిటీ సమీపంలోని పోలమాంబ ఆలయం వద్ద దుకాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అర్థరాత్రి సమయంలో కనీసం నోటీసులు ఇవ్వకుండా దుకాణాలను కూల్చడం ఏంటంటూ బాధితులు ఆందోళనకు దిగారు. 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామన్న బాధితులు..గతంలో సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు. ఉపాధిని కూల్చేయటం ద్వారా తమ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Continues below advertisement