Narsipatnam Ward Councilor Slaps Himself With Sandal: ఆవేదనతో చెప్పు పెట్టి కొట్టుకున్న కౌన్సిలర్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. ఎన్నికై మూడేళ్లు కావొస్తున్నా.... గ్రామంలో కుళాయి కూడా వేయించలేకపోయాననే బాధతో..... 20వ వార్డు కౌన్సిలర్ రామరాజు.... సమావేశంలోనే చెప్పుతో తనను తాను కొట్టుకున్నారు. అప్రోచ్ రోడ్డు వేయలేకపోయానని కన్నీరు పెట్టుకున్నారు. తన వార్డు సమస్యలను మూడేళ్లుగా చెప్తున్నప్పటికీ.... ఎవరూ తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎన్నుకున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్ననాని బాధపడ్డారు.