‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’

Continues below advertisement

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ ను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్యాలెస్ మొత్తం భవనాలు పరిశీలించారు. అడుగడుగునా జగన్ విలాసాల కోసం జనం సొమ్ము వెచ్చించి కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. ‘‘గత 5 ఏళ్ళుగా, నాసిరకం మద్యంతో, ఏపి ఎస్కోబార్ వైఎస్ జగన్, ప్రజల రక్తాన్ని తాగేసాడు. మద్యం తయారీ అతనిదే, అమ్మేది కూడా అతనే. చేతకాని చెత్త పాలకుడు జగన్ రెడ్డి, చెత్త పన్ను వేసాడు కానీ, రాష్ట్రంలో చెత్త మాత్రం తీయలేదు. రాష్ట్రం మొత్తం 85 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఇది తీయటానికే భారీగా ఖర్చు అవుతుంది. ఈ సైకో మనస్తత్వం ప్రజలు అర్ధం చేసుకోవాలి. విలాసవంతమైన ప్యాలెస్ లో, బాత్ రూమ్ లో టబ్ లో పడుకోవటానికి రూ.36 లక్షలు ఖర్చు పెట్టాడు. కమోడ్ మీద కూర్చోవటానికి రూ.12 లక్షలు ఖర్చు పెట్టాడు. ఒక వ్యక్తి తన విలాసాల కోసం, కట్టుకున్న ఈ రుషికొండ ప్యాలెస్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం వేస్తుంది, తరువాత కోపం వస్తుంది. ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కలిపి రూ.500 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ, తన విలాసాల కోసం కట్టిన ప్యాలెస్ కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టాడు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram