జలపాతంలో కలెక్టర్, సామాన్యుడిలా ఎంజాయ్!

Continues below advertisement

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పర్యాటకంగా ఎంతో ఆకర్షణగా ఉండే సంగతి తెలిసిందే. తాజాగా ఆ జలపాతాన్ని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. ఆయన ఒక సామాన్యుడిలా జలపాతంలో ఎంజాయ్ చేశారు. తన కుటుంబంతో పాటు అక్కడికి వచ్చిన కలెక్టర్ చాలా సేపు జలపాతం వద్ద గడిపారు. ఇలా ఒక కలెక్టర్ మామూలు మనిషిలా తమ మధ్యకు వచ్చి గడపడంతో అక్కడి పర్యటకులు ఆశ్చర్యపోయారు. 

ఇలాంటి ప్రకృతి అందాల‌ను వీక్షించేందుకు ఏపీఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తెచ్చింది. కార్తీక మాసం సందర్భంగా పిక్ నిక్‌ల‌కు లంబసింగికి స్పెషల్ బ‌స్సుల‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ బ‌స్సులు శ‌ని, ఆదివారాల్లో తెల్లవారుజామున 3 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్నం ద్వారకా బ‌స్ స్టేష‌న్ నుండి బ‌య‌లుదేరతాయి. లంబ‌సింగి, తాజంగి డ్యామ్‌, కొత్తప‌ల్లి వాట‌ర్ ఫాల్స్‌, మోద‌మాంబ గుడి (పాడేరు), కాఫీ తోట‌లు చూసి వ‌చ్చే విధంగా టూర్ ప్లాన్ చేశారు. టిక్కెట్టు ధ‌ర ఒక్కొక్కరికి అల్ట్రా డీల‌క్స్ రూ.800, ఎక్స్‌ప్రెస్ రూ.650గా నిర్ణయించారు. ఇత‌ర వివ‌రాల కోసం 9959225602, 9052227083, 9959225594, 9100109731 ఫోన్ నెంబ‌ర్‌ల‌ను సంప్ర‌దించాల‌ని జిల్లా ప్రజా ర‌వాణా అధికారి బి. అప్పల‌నాయుడు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram