టీడీపీ నేత వేధింపులు తాళలేక బెజవాడలో బాలిక ఆత్మహత్య
బెజవాడలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుంది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను ఇబ్బందులకు గురి చేశాడని.. అతని వేధింపులు తట్టుకోలేక.. మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. ఇదే విషయం చెప్తూ బాలిక మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందన్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని వేడుకున్నారు. బాధిత కుటుంబాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఆడపిల్లలు జోలికి వెళ్లాలంటేనే భయపడేలా శిక్ష అమలు చేయాలని వెల్లంపల్లి అన్నారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన నిందితులను వదిలే ప్రసక్తే లేదని పద్మ తెలిపారు.
Tags :
AP Crime Vasireddy Padma Minister Vellampalli Srinivas Minister Vellampalli Sexual Harassment Vijaywada Girl Suicide Tdp Leader Vinod Jain Arrest Vijayawada Minor Girl Suicide Tdp Leader Harrassment Women Commission Chairperson Ap