బెజ‌వాడ‌ను వెంటాడుతున్న బ్లేడ్ బ్యాచ్ .. వైఎస్ఆర్ కాల‌నిలో ఆగ‌డాలు...

Continues below advertisement

బెజ‌వాడ శివారు ప్రాంతమైన వైయస్సార్ కాలనీలో గంజాయి మత్తులో యువకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఒక యువకుడు గంజాయి సేవించి స్థానికుల పై దాడులకు తెగబడ్డ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు అతనిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గంజాయి సేవించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు..నివాసాల మధ్యలో ఖాళీగా ఉంచిన అపార్ట్మెంట్ ల‌ కారణంగా బ్లేడ్ బ్యాచ్ గంజాయి యువకులు చేస్తున్న ఆగడాలను అరికట్టలేక పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే క‌క్ష‌పెట్టుకొని తిరిగొచ్చి త‌మ పై దాడులకు పాల్పడుతున్నారని స్దానికులు అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram