Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిద్ధమవుతున్నారు. బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ని దర్శించుకున్న అనంతరం ఆయన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు.ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా నిలబడి వారి గొంతును వినిపించేందుకే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రజా వాణిని అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌లోనూ బలంగా వినిపించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రజల తరఫున ఒక లాయర్‌గా, బాధ్యతా యుతమైన ప్రజా ప్రతినిధిగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను రాజకీయ వేదికపై బలంగా ప్రస్తావించడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.నూతన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలను ఈ నెలలోనే ప్రారంభిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు. విజయవాడ వేదికగా ఈ నెలలోనే విస్తృత స్థాయి మీడియా సమావేశాన్ని నిర్వహించి తన భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, పార్టీ విధివి ధానాలు, కార్యాచరణకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు లేకుండా పుష్కలంగా వర్షాలు కురవాలని, ఎల్‌నినో ప్రభావం లేకుండా రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉండాలని, రైతులంతా సుభిక్షంగా ఉండాలని దేవుని ప్రార్థించినట్లు విజయ సాయి రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఆహార కొరత వంటి సమస్యలు తలెత్తకుండా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిం చినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు.కొత్త పార్టీ ప్రకటనతో ఏపీ రాజకీ యాల్లో విజయసాయి రెడ్డి భవిష్యత్ రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola