Vijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP Desam

Continues below advertisement

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలను వదిలేస్తున్నట్లు ప్రకటించారు సాయిరెడ్డి. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన..రేపే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2028 వ సంవత్సరం వరకూ సాయిరెడ్డికి పదవీకాలం ఉన్నా ఆయన రాజీనామా చేస్తుండటం గమనార్హం. ఈ మేరకు ట్విట్టర్ లో తన నిర్ణయాన్ని ప్రకటించిన విజయసాయిరెడ్డి తనను రెండు సార్లు ఎంపీ చేసినందుకు జగన్, వైఎస్ భారతికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా తనకు ఎవరూ రాజకీయ శత్రువులు లేరన్న విజయసాయిరెడ్డి...చంద్రబాబు తనకు బంధువు అని, పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడని పేర్కొన్నారు. ఇక భవిష్యత్తును వ్యవసాయానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి...తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని..డబ్బుకు ఆశపడో..మరొక విషయానికి భయపడో రాజకీయాలను వదిలేస్తున్నానని ప్రకటించటం లేదన్నారు. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత ఆప్తుడైన విజసాయిరెడ్డి...జగన్ తాత వైఎస్ రాజారెడ్డి హయాం నుంచి ఆడిటర్ వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించారు. విజయసాయిరెడ్డి అల్లుడు అరబిందో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో, కాకినాడ యాంకరేంజ్ పోర్టు షేర్ల బదలాయింపులు అంశాలు ఇటీవలి కాలంలో విజసాయిరెడ్డిని ఇబ్బందులకు గురిచేశాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola