తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ గుండెలపై కూర్చుని..!
Raghurama Krishna Raju Case: సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉన్నాయి. సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు.. అందులో సంచలన విషయాలను వెల్లడించారు. ప్రస్తుత ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జైల్లో టార్చర్ పెట్టిన కేసులో విజయ్ పాల్ కీలక వ్యక్తి అని.. జైట్టో థర్డ్ డిగ్రీ పాటంచడం వెనుక అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అసలు విజయ పాల్ రిమాండ్ రిపోర్టులో ఉన్న సంచలన విషయాలు ఏంటి ఈ వీడియోలో....
- విజయ్ సారథి, కరస్పాండెంట్