వైసీపీ పై బీజేపి నేతల ఆరోపణలకు మంత్రి వెలంపల్లి కౌంటర్
అంతర్వేది రథం దగ్ధమైన ఘటన పై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మంత్రి వెలంపల్లి ప్రశ్నించారు. మతం ముసుగులో ఓట్ల రాజకీయాలు నడపాలని చూస్తున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని ఉద్దేశంతోనే బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బిజెపి నేతలు సీఎం రమేష్,సుజనా చౌదరి బిజెపి నాయకులను తెచ్చి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.