పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

Vangalapudi Anitha Reacts on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత స్పందించారు. ‘‘కడుపు మంటతో పవన్ కళ్యాణ్ మాట్లాడి వుంటారు. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజీలతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో లోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. గౌతు శిరీష, రంగనాయకమ్మ, లాంటి వారిని సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో CID పోలీసులు రాత్రి వరకు స్టేషన్ లో ఉంచుకున్నారు. కూటమిలో ఏం జరుగుతుందో అని గోతి కాడ నక్కలా కాచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో జరుగుతున్న వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ బాధతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు బాధ కొద్ది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను. నేను పవన్ కళ్యాణ్ గారి మాటలను చాల పాజిటివ్ గా తీసుకున్నా. పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాల పకడ్బందీగా ఉన్నాం’’ అని అనిత అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola