రైతు భరోసా కేంద్రంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన దుండగులు
శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పర వలస గ్రామంలో రైతులకు ఎరువులు అందట్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెంటర్లో తాళాలు పగలగొట్టి కంప్యూటర్లు , ఫర్నిచర్ ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ విషయంపై సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు, అధికారులు పరిశీలించారు.