Udhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

Continues below advertisement

 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రియాక్ట్ అయ్యారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని దానిని నిర్మూలించాలని ఉదయ్ చేసిన వ్యాఖ్యలను తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో తప్పు పట్టిన పవన్ కళ్యాణ్..సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునే వాళ్లే నాశనమైపోతారని కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చాలా తాపీగా స్పందించారు. పవన్ కళ్యాణ్ అన్న మాటలను ఎలా చూస్తారని మీడియా స్టాలిన్ ను ప్రశ్నించగా సింపుల్ గా లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నారు. అంటే సనాతన ధర్మాన్ని తమిళనాడులో లేకుండా చేస్తామన్న వ్యాఖ్యలను పవన్ ఎలా అడ్డుకుంటారో తనూ చూస్తానని..ప్రజలు వేచి చూడాలని ఉదయనిధి స్టాలిన్ చెప్పినట్లు డీఎంకే వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ద్రవిడ భావజాలానికి విఘాతంగా భావించే సనాతన ధర్మంపై ముందు నుంచి డీఎంకే వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram