TTD AEO Suspended | టీటీడీ ఏఈఓపై సస్పెన్షన్ వేటు

టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరించారన్న ఆరోపణలు రావడంతో ఈవో శ్యామలరావు అతని సస్పెండ్ చేశారు.  

తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన రాజశేఖర్ టీటీడీలో ఏఈవోగా పనిచేస్తున్నారు. ప్రతీ ఆదివారం స్థానికంగా ఉన్న చర్చిలో రాజశేఖర్  ప్రార్థనలు చేసేందుకు వెళ్తున్నారని స్థానిక భక్తల నుంచి టీటీడీ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దాంతో విచారణ జరిపిన టీటీడీ ఫిర్యాదులు నిజమేనని నిర్థారించుకుంది. ఈ విషయం టీటీడీ ఈవో దృష్టికి వెళ్లడంతో రాజశేఖర్‌ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగిందని.. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ విడుల చేసిన ప్రకటనలో ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola