CM Jagan Flexi Controversy: సీఎం ఫ్లెక్సీ కోసం ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను తీసేశారు..!
CM Jagan Flexi Controversy: కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించిన ఓ వీడియో రాజకీయ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది. సర్పవరం జంక్షన్ లో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ ఏర్పాట్లలో భాగంగా సీఎం జగన్ ఫ్లెక్సీకి అడ్డుగా ఉన్నాయని ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను తొలగించారు. ప్రచారం పిచ్చిలో పడి ప్రజలు ఇబ్బందులు పడేలా వైసీపీ శ్రేణులు ఇలా ప్రవర్తించడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.